యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆ చిత్రం టైటిల్ ను అనౌన్స్ చేస్తూ, టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. గీతా గోవిందం చిత్రం తర్వాత వీరి కాంబినేషన్ లో వస్తున్న చిత్రం కావడంతో సినిమా పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి ఫ్యామిలీ స్టార్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు మేకర్స్.
సినిమా థీమ్‌తో కూడిన టైటిల్ టీజర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. పిల్లలను స్కూల్‌కి రెడీ చేయడం, కూరగాయలు కొనడం వంటి ఇంటి పనుల్లో మగవాళ్లు జాగ్రత్తలు తీసుకుంటే తప్పేమీ లేదని విజయ్ దేవరకొండ అన్నారు. ఈ టైటిల్‌ని బట్టి చూస్తే మేకర్స్ ఫ్యామిలీ ఆడియన్స్‌ని టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. విజయ్ కొంతమంది గూండాలకు స్వీట్ వార్నింగ్ ను ఇవ్వడం కూడా మనం చూడవచ్చు. సినిమాలో యాక్షన్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని అర్దం అవుతుంది. ఈ వీడియో లో విజయ్ భార్యగా మృణాల్ ఠాకూర్ కనిపించారు. మొత్తంమీద ఈ సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వైబ్స్ ఇస్తుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రం 2024 సంక్రాంతికి విడుదల కానుంది.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
