సింగరేణి కార్మికుడిగా విజయ్ దేవరకొండ !

Published on Jan 30, 2019 10:52 am IST

గత ఏడాది బ్యాక్ టు బ్యాక్ హిట్లు కొట్టిన సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం రెండు చిత్రాల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి భరత్ కమ్మ దర్శకత్వంలో ‘డియర్ కామ్రేడ్’ అనే చిత్రం కాగా మరొకటి క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ చిత్రం ప్రస్తుతం కొత్తగూడెం లో షూటింగ్ ను జరుపుకుంటుంది. ఈ చిత్రంలో విజయ్ సింగరేణి కార్మికుడిగా నటిస్తున్నారు. ప్రస్తుతం వాటికీ సంబందించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

అయితే కార్మికుని పాత్ర సినిమాలో ఒక భాగం మాత్రమే క్లాస్ , మాస్ అన్ని అంశాలతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు. కె ఎస్ రామారావు నిర్మిస్తున్న ఈచిత్రంలో రాశి ఖన్నా , ఐశ్వర్య రాజేష్ కథానాయికలుగా నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More