“డియర్ కామ్రేడ్” ట్రైలర్: ప్రేమకి, పోరాటానికి మధ్య యువకుని సంఘర్షణ.

Published on Jul 11, 2019 11:17 am IST

విజయ్ దేవరకొండ,రష్మిక ప్రధాన పాత్రలలో దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “డియర్ కామ్రేడ్”. ముందుగా ప్రకటించిన విధంగా ఈ చిత్ర ట్రైలర్ నేడు కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. ట్రైలర్ మొత్తంగా చెప్పాలంటే ప్రేమకి పోరాటానికి మధ్య మానసిక సంఘర్షణ అనుభవించే ఓ యువకుని కథగా తెరకెక్కుతుంది అనిపిస్తుంది.

విజయ్ చిన్నప్పటి స్నేహితురాలైన రష్మిక క్రికెట్ స్టేట్ లెవెల్ ప్లేయర్. వీరిద్దరి మధ్య గాఢమైన ప్రేమ పుడుతుంది. కానీ సోషల్ భావాలున్న విజయ్ పెద్దవారితో గొడవలు, పోరాటాలు వీరిమధ్య అడ్డుగా నిలుస్తాయి. చివరకు ప్రేమా,సమాజమా అనే ఆలోచనలో ప్రేమను వదిలేసి పోరాటం వైపు వెళ్లిన విజయ్ ని మాత్రం ఆ ప్రేమ గుర్తులు బాధిస్తుంటాయి. కొన్నేళ్ల తరువాత మళ్ళీ ప్రేమ కావాలంటూ ప్రేమించిన అమ్మాయి కొరకు వెళతాడు. ఈ ప్రేమ, పోరాటాల మధ్య తన లక్ష్యం ఎలా సాధించాడన్నదే కథలా తెలుస్తుంది.

సోషల్ భావాలు కలిగిన ఆవేశపడే యువకుడిగా,ప్రేమికుడిగా విజయ్ నటన అద్భుతంగా ఉంది. అలాగే రశ్మిక విజయ్ ప్రియురాలిగా మంచి నటన కనబరిచింది. రొమాన్స్,కామెడీ,యాక్టన్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్న ట్రైలర్ అంచనాలకు మించి ఉంది. విజయ్ ఈ మూవీతో మరో బ్లాక్ బస్టర్ అనుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 26న విడుదల కానుంది.

ట్రైలర్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

X
More