ఇంటర్వ్యూ : విజయ్ దేవరకొండ – నేను సంపాదించిన దాంట్లో 70% ఈ సినిమాకే పెట్టాను !

Published on Oct 31, 2019 12:57 pm IST

హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా నిర్మిస్తోన్న తొలి చిత్రం.. ‘మీకు మాత్రమే చెప్తా’. దర్శకుడు తరుణ్ భాస్కర్, వాణి భోజన్, అభినవ్ గోమఠం ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రానికి నూతన దర్శకుదు షమ్మీర్ సుల్తాన్ దర్శకత్వం వహించారు. కాగా ఈ చిత్రం నవంబర్ 1న విడుదల అవుతుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మీడియాతో మాట్లాడారు.

 

మీరు నిర్మాతగా ఈ సినిమా ఎలా మొదలైంది ?

నేను పెళ్లి చూపులు మూవీ చేశాక, మొదటిసారి ఈ సినిమా దర్శకుడు షమ్మీర్ అండ్ అర్జున్ నన్ను కలిశారు. అప్పటికే వాళ్ళ చేసిన షార్ట్ ఫిల్మ్స్ చూసాను. ఏ మాత్రం బడ్జెట్ లేకుండానే చాల బాగా తీసారు. వాళ్ళ స్కిల్ చూసి.. వెంటనే వాళ్లతో సినిమా చేస్తానని చెప్పాను. ఆ తరువాత వాళ్ళు నాకు ‘మీకు మాత్రమే చెప్తా’ స్క్రిప్ట్ చెప్పారు. నేను చేద్దాం అన్నాను. కానీ, ఆ తరువాత నాకు ఈ స్క్రిప్ట్ కరెక్ట్ కాదు అని అనిపించింది. బట్ సినిమా అయితే చేయాలి. అలా చివరికి నేను నిర్మాతగా ఈ సినిమా రాబోతుంది.

 

తరుణ్ భాస్కర్ నే ఎందుకు హీరోగా పెట్టుకున్నారు ?

తరుణ్ భాస్కర్ టైమింగ్ చాల బాగుంటుంది. తను ‘పెళ్లి చూపులు’ సినిమా షూట్ చేస్తున్నప్పుడే తను కొన్ని సీన్స్ లో యాక్ట్ చేసి చూపించేవాడు. నిజంగా మాకంటే బాగా చేసేవాడు. సో.. తరుణ్ అయితేనే ఈ స్క్రిప్ట్ కి బాగుంటుందని తనని అడిగి చేయించాము. అద్భుతంగా నటించాడు.

 

నిర్మాతగా ఈ సినిమాలో మీరు ఎంతవరకు ఇన్ వాల్వ్ అయ్యారు ?

స్క్రిప్ట్ లో ఇన్ వాల్వ్ అయ్యాను గాని, ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ చేశాక, ఇక నేను ఈ సినిమాలో ఎక్కడా ఇన్ వాల్వ్ అవ్వలేదు. సెట్ కి ఒకే ఒక్క సారి వెళ్ళాను.

 

మీ అంచనాలను షమ్మీర్, అర్జున్ అందుకోగలిగారా ?

వాళ్ళలా పనిచేసే వాళ్ళను నేను నా సెట్ లో ఎక్కడా చూడలేదు. చాల హార్డ్ వర్క్ చేశారు. అవుట్ ఫుట్ మీద పూర్తి నమ్మకంతో ఉన్నాము.

 

ఈ సినిమాకి ఎంత బడ్జెట్ అయింది ?

నేను ఇప్పటివరకూ చేసిన సినిమాల ద్వారా సంపాదించిన ఎమౌంట్ లో దాదాపు 70% ఈ సినిమాకే ఖర్చు పెట్టాను. మా డాడి కూడా మొదట్లో ఇప్పుడు ఎందుకురా ప్రొడక్షన్, యాక్టింగ్ మీద దృష్టి పెట్టకుండా అని అన్నారు. కానీ చేద్దాం.. స్క్రిప్ట్ బాగుంది అని చేసేశాం. అయితే గుడ్డిగా ఏమి చేయలేదు, ఈ టీమ్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. అందుకే చేశాను.

 

‘మీకు మాత్రమే చెప్తా’ స్క్రిప్ట్ లో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న అంశం ఏమిటి ?

ఈ కథ విన్నంత సేపూ నవ్వుతూనే ఉన్నాను. రేపు ఆడియన్స్ సినిమా హాల్ నుండి బయటకి వచ్చేటప్పుడు నవ్వుకుంటూ వస్తారు, ఈ రోజుల్లో హ్యూమర్ వర్కౌట్ అవుతుంది. సినిమా చేశాక, సినిమాని బాగా చేశారు, బాగా ఎంజాయ్ చేశాం అని ఆడియన్స్ ఖచ్చితంగా ఫీల్ అవుతారు.

 

మీ తదుపరి సినిమాలు గురించి చెప్పండి ?

‘వరల్డ్ ఫేమస్ లవర్’కి నాకు ఇంకో ఎనిమిది రోజులు షూటింగ్ ఉంది. పురిగాతో చేయబోయే సినిమా జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఆ తరువాత హీరో సినిమా.. దాని తరువాత శివ నిర్వాణతో సినిమా ఉంటుంది.

సంబంధిత సమాచారం :

X
More