‘సూర్య’ గురించి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ !

‘సూర్య’ గురించి ఓపెన్ అయిన విజయ్ దేవరకొండ !

Published on Sep 30, 2018 6:15 PM IST

Vijay Deverakonda Suriya
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ద్విభాషా చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌ పై ఈ చిత్రాన్ని జ్ఞానవేల్‌ రాజా రూపొందిస్తున్న సంగతి తెలిసిందే.అక్టోబర్ 5 వ తేదీన ‘నోటా’ విడుదల కానుంది. కాగా తాజాగా విజయ్ తాజాగా ఇచ్చిన ఓ ప్రమోషనల్ ఇంటర్వ్యూలో తమిళ్ స్టార్ హీరో సూర్యతో కలిసి పనిచేయడం గురించి తన మనసులోని మాటను బయట పెట్టాడు.

విజయ్ మాటల్లో ‘నాకు కూడా సూర్యగారి సినిమాలో.. ఆయనతో కలిసి నటించాలని ఉంది. ఇది చాలామందికి ఉంటుంది. కానీ అవకాశం వస్తే మాత్రం.. నేను ఖచ్చితంగా ఆయనతో కలిసి నటిస్తానని విజయ్ దేవరకొండ చెప్పుకొచ్చాడు.

‘ఇరుముగన్’ ఫెమ్ ఆనంద్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మెహ్రీన్, సంచనా నటరాజన్ కథానాయికలుగా నటిస్తున్నారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రముఖ సీనియర్ నటులు సత్యరాజ్, నాజర్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండటం విశేషం.

తాజా వార్తలు