‘విజయ్ దేవరకొండ – పూరి సినిమా టైటిల్ ఫిక్స్ !

‘విజయ్ దేవరకొండ – పూరి సినిమా టైటిల్ ఫిక్స్ !

Published on Jan 18, 2021 10:27 AM IST

సెన్సేషనల్ హీరో ‘విజయ్ దేవరకొండ’ ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో చేస్తున్న సినిమాకి టైటిల్ ‘ఫైటర్’ అంటూ వార్తలు వచ్చినా.. తాజాగా చిత్రబృందం తమ సినిమా టైటిల్ ను అధికారికంగా ప్రకటించింది. ‘లిగర్’ (సాలా క్రాస్ బ్రీడ్) అని పూరి బృందం టైటిల్ ను ఫిక్స్ చేశారు. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు.

ఫైటర్ కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి. అలాగే ‘ఇస్మార్ట్ శంకర్’ ఇచ్చిన సక్సెస్ కిక్ తో ప్రస్తుతం పూరి ఈ సినిమాని చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు