నేషనల్ లెవల్లో పిచ్చెక్కిస్తానంటున్న రౌడీ హీరో

Published on Jan 20, 2021 1:09 am IST

విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలోకి ‘లైగర్’ అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ నిన్ననే విడుదలైంది. ఇందులో విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ముఖ్యంగా రౌడీ హీరో అభిమానులకు తెగ నచ్చింది. అందుకే ఫస్ట్ లుక్ విడుదలను పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుని సెలబ్రెట్ చేసుకున్నారు. కొందరు ‘లైగర్’ పేరును పచ్చబొట్లుగా వేయించుకున్నారు.

ఆ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. చిత్ర నిర్మాత ఛార్మి సైతం వాటికి స్పందించారు. ఆ సెలబ్రేషన్స్ చూసిన విజయ్ కూడ ఎమోషనల్ అయ్యారు. నిన్న మీరు నన్ను భావోద్వేగానికి గురిచేశారు. మీ ప్రేమ నా వరకు చేరింది. ఒకప్పుడు నా పనిని ఎవరైనా గుర్తిస్తారా లేదా అని కంగారుపడేవాడిని. కానీ నిన్నటి సెలబ్రేషన్స్ నన్ను కదిలించాయి. నా మాటల్ని గుర్తుపెట్టుకోండి.. టీజర్ విడుదలయ్యాక నేషనల్ లెవల్ మ్యాడ్ నెస్ గ్యారెంటీ అంటూ మాటిచ్చారు. విజయ్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే పూరి సినిమాను ఏ లెవల్లో తెరకెక్కిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. 125 కోట్ల భారీ వ్యయంతో నిర్మితమవుతున్న ఈ సినిమా తెలుగుతో పాటు హిందీలో కూడ రూపొందుతోంది.

సంబంధిత సమాచారం :