‘కిల్లర్’తో విజయ్ ఎట్టకేలకు హిట్ కొట్టినట్లున్నాడుగా…!

Published on Jun 7, 2019 7:45 pm IST

విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు’ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమయ్యాడు. ‘బిచ్చగాడు’ తెలుగులో ఊహించని విజయాన్ని నమోదు చేసింది. ఏకంగా ఈ డబ్బింగ్ మూవీ 40 కోట్ల పైగా వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను షాక్ గురి చేసింది. కేవలం 10 కోట్ల లోపే తెలుగు హక్కులు సొంతం చేసుకున్న నిర్మాతలు ఈ మూవీతో భారీ లాభాలు ఆర్జించారు.

పొతే అప్పటినుండి తెలుగులో హిట్ కొట్టాలని విజయ్ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆయన వరుసగా విడుదల చేసిన బేతాళుడు,ఇంద్రసేనా,రోషగాడు,కాశి చిత్రాలు అనుకున్నంతగా తెలుగులో విజయం సాధించలేదు. కానీ విజయ్ మళ్ళీ మూడేళ్ళ తరువాత “కిల్లర్”తో హిట్ కొట్టే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ టాక్ . క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చిన ‘కిల్లర్’ కు క్రిటిక్స్ తో పాటు మూవీ విశ్లేషకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దాదాపు అన్ని వెబ్సైట్స్ లో ఈ మూవీ కి అనుకూలంగా తీర్పు వచ్చింది.

ఈ సంధర్బంగా విజయ్ ఆంటోని మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ ఓ ట్వీట్ ని తన ఖాతాలో పోస్ట్ చేశారు. అర్జున్ పోలీస్ ఆఫీసర్ గా కీలక పాత్రపోషించిన ఈ మూవీలో హీరోయిన్ గా ఆషిమా నర్వాల్ నటించగా, ఆండ్రూ లూయిస్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :

More