ఫన్ ఎంటర్ టైనర్ గా “గోవిందా భజ గోవిందా”

Published on Jul 13, 2021 7:00 am IST

తెలుగు సినీ పరిశ్రమలో మళ్ళీ సినిమా షూటింగ్ ల ప్రక్రియ మొదలైంది. వీలైనంత త్వరగా సినిమాలని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు చిత్ర బృందాలు సన్నాహాలు చేస్తున్నాయి. అయితే తాజాగా గోవిందా భజ గోవిందా చిత్రం పోస్టర్ ను ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్, పాగల్ మూవీ దర్శకుడు నరేష్ లు విడుదల చేయడం జరిగింది. అయితే చిత్రం టైటిల్ తో ప్రేక్షకులను ఆకట్టుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే నిర్మాత బెక్కమ్ వేణుగోపాల్ విడుదల చేసిన ఈ చిత్రం పోస్టర్ ప్రస్తుతం చర్చాంశనీయం గా మారింది. ఈ చిత్రం లో దుర్మార్గుడు ఫేం విజయ్ కృష్ణ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియా శ్రీనివాస్ నటిస్తున్నారు. కమల్ తేజ, సూర్య తేజ తదితరులు ఈ చిత్రం లో కో ఆర్టిస్టులు గా నటించడం జరిగింది. అయితే ఈ చిత్రం పూర్తి హాస్య భరితంగా ఉంటుంది అని, ఫ్యామిలీ తో కలిసి హ్యాపీ గా నవ్వుకోవచ్చు అని దర్శకుడు సూర్య కార్తికేయ అన్నారు. అయితే ఎన్నో సినిమాలకు సహాయ దర్శకుడి గా పని చేసిన ఆయన తొలిసారి దర్శకుడు గా పని చేస్తున్నారు. అయితే నవ్వును కోరుకొనే వారు కచ్చితంగా చూసి నవ్వుకొని హ్యాపీ గా ఇంటికి తిరిగి వస్తారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి సూర్య కార్తికేయ మరియు ఉపేంద్రలు నిర్మాతలు గా వ్యవహరించారు.

సంబంధిత సమాచారం :