కమర్షియల్ డైరెక్టర్ వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘అల్లుడు శీను’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన హీరో బెల్లంకొండ శ్రీనివాస్. ఆ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీనివాస్ ప్రస్తుతం భీమనేని శ్రీనివాస్ తో కలిసి తన సెకండ్ సినిమా చేస్తున్నాడు. ఇది తమిళంలో హిట్ అయిన ‘సుందరపాండ్యన్’ సినిమాకి రీమేక్. ఇది చివరి దశలో ఉండగానే శ్రీనివాస్ తన మూడవ సినిమాకి సైన్ చేసాడు. అది కూడా ఓ లవ్ స్టోరీని మరియు లవ్ స్టోరీస్ ని బాగా చూపిన డైరెక్టర్ ని ఎంచుకోవడం విశేషం.
గుండెజారి గల్లంతయ్యిందో సినిమాతో నితిన్ కి హిట్ ఇచ్చి, ఆ తర్వాత నాగ చైతన్యతో ‘ఒక లైలా కోసం’ అంటూ హిట్ ఇచ్చిన విజయ్ కుమార్ కొండ చెప్పిన స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. రీసెంట్ గా విజయ్ కుమార్ చెప్పిన లైవ్ నచ్చడంతో శ్రీనివాస్ ఓకే చెప్పగా ప్రస్తుతం విజయ్ కుమార్ ఫుల్ స్క్రిప్ట్ ని డెవలప్ చేసే పనిలో ఉన్నాడు. వచ్చే ఏడాది మొదట్లో ప్రారంభం కానున్న ఈ సినిమాని ఓ కన్నడ నిర్మాత నిర్మించనున్నాడు.


