‘ఏదైనా జరగొచ్చు’… ఫస్ట్ లుక్ !

‘ఏదైనా జరగొచ్చు’… ఫస్ట్ లుక్ !

Published on Apr 6, 2019 3:08 PM IST

రమాకాంత్ దర్శకత్వంలో వెట్ బ్రెయిన్ ఎంటర్టైన్మెంట్ మరియు సుదర్మ్ ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం “ఏదైనా జరగొచ్చు”. ఈ చిత్రంలో శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా హీరోగా వెండితెరకు పరిచయమవుతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ విలక్షణ నటుడు తమిళ స్టార్ బాబిసింహా విలన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను సీనియర్ పాత్రికేయులు వినాయకరావు, డిజిటల్ పోస్టర్ ను సీనియర్ పాత్రికేయులు పసుపులేటి రామారావు ఆవిష్కరించారు.

ఈ సంధర్భంగా రామానాయుడు స్టూడియోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో…వినాయక్ రావు మాట్లాడుతూ… హీరో గా పరిచయం అవుతున్న నా స్నేహితుడు శివాజీరాజా కుమారుడు మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను. కవరేజ్ కోసం వచ్చిన నన్ను చీఫ్ గెస్ట్ చేసి ఏదైనా జరగొచ్చు అనిపించారు. తన తండ్రి శివాజీరాజా లాగా మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు.

ప్రొడ్యూసర్ ఉమాకాంత్ మాట్లాడుతూ… మా సినిమా ని అందరూ చూసి తప్పకుండా ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు. సురేశ్ కొండేటి మాట్లాడుతూ… ఈ సినిమానే కాదు ఏ సినిమా కైనా నా అన్నయ్య తనయుడు విజయ్ కి మంచి విజయం సాదించాలని కోరుకుంటున్నాను అన్నారు. కథే మంచి హీరో మంచి కంటెంట్ తో రమాకాంత్ గారిని నమ్మి సినిమా చేశారు అన్నారు.

నటుడు శివాజీరాజా మాట్లాడుతూ… కాకతుల్యం అయిన కూడా వినాయకరావ్, రామారావు న కెరీర్ మొదటినుంచి ఉన్నారు. ఈ ఫంక్షన్లలో రామసత్యనారాయన ఉండడం కూడా చాలా ఆనందంగా ఉంది. నేను ప్రొడ్యూసర్ ని ఇప్పుడే మొదటిసారి చూస్తున్నాను. కొత్తవారితో చేస్తే కథ కొత్తగా ఉంటుంది అని రమాకాంత్ గారితో చేయించాను సినిమా చాలా బాగా వచ్చింది. ప్రొడ్యూసర్ ఎక్కడా వెనకాడకుండా ఖర్చుపెట్టారు అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు