ఫ్యాన్స్ కు విజయ్ రిక్వెస్ట్ !

Published on Mar 8, 2019 3:00 am IST

తమిళనాడు లో ఇళయదళపతి విజయ్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పవసరం లేదు. ప్రస్తుతం విజయ్ తన 63 వచిత్రంలో నటిస్తున్నాడు. ఈచిత్రం యొక్క షూటింగ్ కు హాజరవుతున్న సమయంలో ఆయన కారు ను కొంత మంది ఫ్యాన్స్ ఫాలో అయ్యారు. ఇది గమనించిన విజయ్ కారు ను స్లో చేయమని డ్రైవర్ కి చెప్పి ప్లీజ్ నన్ను ఫాలో కాకండి అని ఫ్యాన్స్ కు చెప్పాడు. దాంతో తమ అభిమాన హీరో మాటను విని ఫాలో అవ్వడం ఆపేశారు.

ఆ తరువాత విజయ్ షూటింగ్ కు హాజరైయ్యారు. ప్రస్తుతం ఈ చిత్రం యొక్క షూటింగ్ చెన్నై లోని ఎస్ ఆర్ ఎమ్ కాలేజీ లో జరుగుతుంది. అట్లీ తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా లో నయనతార కథానాయికగా నటిస్తుంది. ఏజి యస్ ఎంటర్టైమెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదలకానుంది.

సంబంధిత సమాచారం :