ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన విజయ్ “బీస్ట్”.!

Published on May 11, 2022 10:02 am IST

ఇళయ తలపతి విజయ్ జోసెఫ్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ యాక్షన్ చిత్రం “బీస్ట్”. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం ఈ ఏడాది గత ఏప్రిల్ లో రిలీజ్ అయ్యి మిక్సిడ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. అయితే పాన్ ఇండియా వైడ్ రిలీజ్ తమిళ్ లో మంచి వసూళ్లను రాబట్టింది.

అలాగే తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ ని సాధించింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటిటి వెర్షన్ కోసం చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు ఈరోజు మే 11 నుంచి స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. నెట్ ఫ్లిక్స్ మరియు సన్ నెక్స్ట్ లలో పాన్ ఇండియా భాషల్లో ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది.

మరి అప్పుడు మిస్ అయ్యిన వారు అయితే ఈ చిత్రాన్ని ఇప్పుడు చూసేయ్యోచు. ఇక ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా అనిరుద్ సంగీతం అందించాడు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం :