ఇంట్రెస్టింగ్..ఈ ఫాథర్స్ డే పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ సేతుపతి

ఇంట్రెస్టింగ్..ఈ ఫాథర్స్ డే పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చిన విజయ్ సేతుపతి

Published on Jun 16, 2024 10:02 AM IST


ప్రముఖ వెర్సటైల్ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రమే “మహారాజ”. చాలా నెలలు తర్వాత మన సౌత్ ఇండియా సినిమా దగ్గర ఆడియెన్స్ ని మెప్పించే ఒక సాలిడ్ హిట్ గా ఈ సినిమాకి సూపర్ టాక్ దక్కింది. విజయ్ సేతుపతి తన కెరీర్ 50వ సినిమాగా నటించగా తన కెరీర్ ప్రతిష్టాత్మక సినిమాగా చేయగా దీనితో తాను గుర్తుండిపోయే భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.

అయితే ఈ చిత్రం ఫాథర్ సెంటిమెంట్ తో కూడిన రివెంజ్ డ్రామాగా వచ్చిన సంగతి తెలిసిందే. తన బిడ్డ కోసం తాపత్రయ పడే తండ్రిగా విజయ్ సేతుపతి తన పాత్రలో జీవించేసాడు. మరి ఈ సినిమా వచ్చిన రెండు రోజుల్లోనే ‘ఫాథర్స్ డే’ రావడం విశేషం గా మారింది. ఖచ్చితంగా ఈ ఫాథర్స్ డే కి ఈ సినిమా మంచి ట్రీట్ అండ్ సేతుపతి నుంచి పర్ఫెక్ట్ గిఫ్ట్ కూడా అని చెప్పాలి.

ఇప్పటికే భారీ బుకింగ్స్ ఈ సినిమాకి నమోదు అవుతుండగా మన తెలుగులో కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు మొదటి రోజు కంటే ఎక్కువ నమోదు అవుతున్నాయి. మొత్తానికి అయితే సేతుపతి హీరోగా కోరుకున్న మంచి హిట్ ని ఈ సినిమాతో అందుకున్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు