తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కు సంభందించిన ఇళ్ళు , కార్యాలయాలపై ఐటీ డిపార్ట్మెంట్ రైడ్ చేసిందని తెలిసిందే. ఈ విషయం ఫై తాజాగా విజయ్ క్లారిటీ ఇచ్చారు. చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐటీ దాడులు జరుగలేదని అవి రొటీన్ సర్వేలు మాత్రమే అని వివరణ ఇచ్చారు. అలాగే నేను మూడు సంవత్సరాలనుండి ట్యాక్స్ లను ముందుగానే చెల్లిస్తున్నాను కానీ రిటర్న్స్ దాఖలు చేయలేదని అన్నారు.
ఐటీ వాళ్లు ఈ వింధంగా సర్వేలు చేస్తారన్న విషయం ఇప్పుడే తెలిసిందని నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అయన అన్నారు. ఈ ఐటీ దాడులు గురించి విని ఆయన అభిమానులు కంగారు పడ్డారు. ఇక విజయ్ నటించిన ’96’ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. మరో మూడు రోజుల్లో ఈచిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. తెలుగులో ఈచిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు రీమేక్ చేయనున్నారు.


