ఈ పండగ రేస్ లో విజయ్ సేతుపతి ‘లాభం’ రిలీజ్.!

Published on Aug 28, 2021 5:51 pm IST

విలక్షణ నటుడు మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన “లాభం” చిత్రం ఏక కాలంలో మొదటిసారి రెండు భాషల్లోనూ విడుదలకి సిద్ధం అవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్ పి జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

ఈ చిత్రానికి లాయర్ శ్రీరామ్ సమర్పణ. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. విజయ్ సేతుపతి నటించిన మాస్టర్, ఉప్పెన తరువాత తెలుగులో విడుదల అవుతున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వినాయక చవితి పర్వదినం సందర్భంగా సెప్టెంబర్ 9న విడుదల అవుతోంది.

మరి ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ… ‘విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన “లాభం” చిత్రం సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఇలా రెండు భాషల్లో మొదటిసారి విజయ్ సేతుపతి చిత్రం విడుదల కావడం విశేషం. మాస్టర్, ఉప్పెన తరువాత విజయ్ సేతుపతి నటించిన పక్కా కమర్షియల్ చిత్రం ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ‘ అని తెలిపారు..

సంబంధిత సమాచారం :