అల్లు అర్జున్ సినిమా గురించి ఆలొచిస్తున్న స్టార్ హీరో

అల్లు అర్జున్ సినిమా గురించి ఆలొచిస్తున్న స్టార్ హీరో

Published on Oct 29, 2019 12:01 PM IST

Allu arjun

అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురము’లో షూటింగ్ ముగియగానే సుకుమార్ సినిమాను మొదలుపెట్టనున్నారు. ఈ సినిమా కథ నల్లమల అడవుల్లో జరిగే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఉండనుంది. సినిమా చాలా వరకు రా అండ్ రస్టిక్ గా ఉంటుందట. అందుకే కథలో ప్రతినాయకుడు కూడా అలానే ఉండాలని ఆ పాత్ర కోసం తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిని సంప్రదించారట సుకుమార్.

సుకుమార్ చెప్పిన స్టోరీ లైన్ విన్న సేతుపతి అనుకూలంగానే స్పందించారని, అయితే ఇంకా సినిమాకు సైన్ చేయలేదట. త్వరలోనే సుకుమార్ఇవ్వబోయే ఫుల్ నరేషన్ విన్న తర్వాత ఫైనల్ కాల్ ఇస్తారట విజయ్ సేతుపతి. ఇప్పటికే ‘సైరా’ చిత్రంలో నటించి మెప్పించిన సేతుపతి చిరు మేనల్లుడు వైష్ణనవ్ తేజ్ డెబ్యూ చిత్రం ‘ఉప్పెన’లో విలన్ రోల్ చేస్తున్నారు. దీంతో పాటే బన్నీ సినిమాను ఓకే చేస్తే ఇకపై తెలుగులో ఆయన రెగ్యులర్ నటుడు కావడం ఖాయం.

తాజా వార్తలు