రెండు పెద్ద పండుగలను టార్గెట్ చేసిన స్టార్ హీరో

రెండు పెద్ద పండుగలను టార్గెట్ చేసిన స్టార్ హీరో

Published on Dec 16, 2020 3:00 AM IST

Vijay 1

తమిళ స్టార్ హీరో విజయ్ ప్రతి ఏడాది కనీసం ఒక సినిమాతో అయినా ప్రేక్షకుల్ని పలకరించేవారు. కానీ ఈ 2020లో మాత్రం కరోనా లాక్ డౌన్ కారణంగా ఆయన నుండి ఒక్క సినిమా కూడ విడుదల కాలేదు. ఆయన కొత్త చిత్రం ‘మాస్టర్’ చిత్రీకరణ పూర్తయినప్పటికీ విడుదలకాలేదు. లోకేష్ కనగరాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఈ 2021 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. విజయ్ ను వెండితెర మీద చూడటానికి వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు అభిమానులు.

ఇక తాజాగా విజయ్ కొత్త సినిమాను ప్రకటించారు. నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. పండుగ తర్వాత ఈ సినిమా పనులు మొదలుకానున్నాయి. అన్నీ ప్లాన్ ప్రకారమే జరిగితే దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని విడుదలచేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. సో.. 2020లో హడావుడి చేయలేకపోయిన విజయ్ 2021లో మాత్రం రెండు సినిమాలతో హంగామా చేయనున్నారు. దీంతో ఆయన అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు