‘మాస్టర్’ ఫస్ట్ కాపీ చూసిన విజయ్ ఏమన్నారంటే..

‘మాస్టర్’ ఫస్ట్ కాపీ చూసిన విజయ్ ఏమన్నారంటే..

Published on Jan 7, 2021 3:00 AM IST

Master 1

తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’. ఈ నెల 13న సినిమా భారీ ఎత్తున విడుదలకానుంది. తెలుగులో కూడ ‘మాస్టర్’ పేరుతో రిలీజవుతుంది. దాదాపు 10 నెలల తర్వాత థియేటర్లోకి వస్తున్న మొదటి భారీ చిత్రం కావడంతో ప్రేక్షకుల్లో సినిమా మీద తారాస్థాయి అంచనాలున్నాయి. ఈ సినిమా ఫలితం మీదే చాలా పెద్ద సినిమాల విడుదలలు ఆధారపడి ఉన్నాయి. విజయ్ అభిమానులైతే సినిమా బ్లాక్ బస్టర్ అవ్వాలని కోరుకుంటున్నారు.

తాజాగా సినిమా గురించి మాట్లాడిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఫస్ట్ కాపీ చూశాక విజయ్ ఏమన్నారో చెప్పుకొచ్చారు. ‘విజయ్ గారికి సినిమాను రెండు వెర్షన్లు చూపించాం. ఒకటి మ్యూజిక్ ఉన్న వెర్షన్ ఇంకొకటి మ్యూజిక్ లేని వెర్షన్. రెండూ చూసిన ఆయన సినిమా బాగా వచ్చిందని అభినందించారు’ అని అన్నారు. అంతేకాదు సినిమాలో ఎంటర్టైన్మెంట్ విలువలు గట్టిగా ఉంటాయని, విజయ, విజయ్ సేతుపతి సన్నివేశాలు హైలెట్ అవుతాయని, వాటిలో మంచి ఎమోషన్ ఉంటుందని ధీమాగా చెప్పారు. గ్జావియర్ బ్రిట్టో నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఈస్ట్ కోస్ట్ పోరాడక్షన్స్ బ్యానర్ ద్వారా మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు.

తాజా వార్తలు