నటి, దర్శకనిర్మాత విజయనిర్మల విగ్రహావిష్కరణ

Published on Feb 18, 2020 11:03 pm IST

సూపర్ స్టార్ కృష్ణ సతీమణి దర్శకనిర్మాత,నటి అయిన విజయ నిర్మల గత ఏడాది హఠాన్మరణం పొందారు. జూన్ 27,2019 న హార్ట్ అటాక్ కారణంగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆమె తుది శ్వాస విడిచారు. కాగా ఈనెల 20న విజయ నిర్మల జయంతిని పురస్కరించుకొని ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ నానక్ రామ్ గూడాలో గల ఆమె స్వగృహం నందు ఉదయం 9గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. చిత్ర ప్రముఖులతో పాటు సూపర్ స్టార్ కృష్ణ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

నటిగా తెలుగు, తమిళ మరియు మలయాళ భాషలలో నటించిన విజయ నిర్మల లేడీ డైరెక్టర్ గా 44చిత్రాలు నిర్మించి గిన్నిస్ వరల్డ్ బుక్స్ ఆఫ్ రికార్డ్స్ లో పేరు సంపాదించారు. చిత్ర పరిశ్రమకు ఆమె అందించిన సేవలకు గుర్తుగా ఆమెను రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించడం జరిగింది.

సంబంధిత సమాచారం :

X
More