విజయనిర్మలగారి అంతిమ యాత్ర రేపు ఉదయం 8 గంటల నుండి !

Published on Jun 27, 2019 4:33 pm IST

సినీ పరిశ్రమలో న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్నారు విజ‌య‌నిర్మ‌ల‌గారు. గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె బుధవారం రాత్రి గుండెపోటుతో క‌న్నుమూయ‌డం ఎంతో బాధాక‌రం. సినీ రంగ పరిశ్ర‌మ‌లో మ‌హిళా సాధికార‌త‌ను చాటిన అతి కొద్ది మంది మ‌హిళ‌ల్లో విజ‌య‌నిర్మ‌ల‌గారు ఒక‌రు. కాగా విజయనిర్మలగారి అంతిమ యాత్ర రేపు (శుక్రవారం) ఉదయం 8 గంటలకు నానక్ రామ్ గుడాలోని ఆమె స్వగృహం నుంచి ప్రారంభమవుతుంది. చిలుకూరులోని ఫామ్ హౌస్ లో అంతిమ సంస్కారం జరుగనుంది. విజయనిర్మలగారి భౌతికకాయానికి ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.

విజయనిర్మలలాంటి ప్రతిభావంతురాలిని ఇప్పట్లో ఇంకెవరినీ చూడలేము. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కృష్ణగారి కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను – చిరంజీవి

‘విజ‌య‌నిర్మ‌ల‌ గారు క‌న్నుమూయ‌డం ఎంతో బాధాక‌రం. ఆమె మృతి చిత్ర‌సీమ‌కు తీర‌నిలోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను’ – నంద‌మూరి బాల‌కృష్ణ‌

మా ఆత్మీయురాలు శ్రీమతి విజయ నిర్మల ఆకస్మిక మరణం నాకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ఆమె పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను – కృష్ణంరాజు

విజయ నిర్మలగారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయకం. ఆమె ఇక లేరన్న వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను – జూ.ఎన్టీఆర్

మీరు ఇండస్ట్రీకి వచ్చి చరిత్ర సృష్టించారు. మీరు సాధించినంతగా ముందు తరాలవారు ఎవ్వరూ సాధించలేరేమో. మిమ్మల్ని మిస్సవుతాం అమ్మమ్మ. మీ సినిమాలు మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి – మంచు మనోజ్‌

సంబంధిత సమాచారం :

More