రాముల్లమ్మ పారితోషికం, హీరోయిన్ కంటే ఎక్కువట.

Published on Jan 17, 2020 7:09 am IST

పదమూడేళ్ల లాంగ్ బ్రేక్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చారు లేడీ అమితాబ్ విజయ శాంతి . మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో ఆమె కథలో కీలకమైన భారతి అనే కాలేజీ ప్రొఫెసర్ పాత్ర చేశారు. ఆ పాత్రలో తన మార్కు పవర్ ఫుల్ నటనతో ఆకట్టుకున్నారు. కాగా ఈ చిత్రం కొరకు విజయశాంతి తీసుకున్న రెమ్యూనరేషన్ వింటే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. హీరోయిన్ రష్మిక కంటే కూడా తన రెమ్యూనరేషన్ ఎక్కువట. ఈ విషయాన్ని విజయం శాంతి స్వయంగా చెప్పుకొచ్చారు.

ఓ ఇంటర్వ్యూ లో విజయశాంతి ని సరిలేరు నీకెవ్వరు కోసం మీ రెమ్యూనరేషన్ ఎంతని అడుగగా.. మహేష్ తరువాత ఎక్కువ రెమ్యూనరేషన్ నాదే అన్నారు. అంటే ఆమె పరోక్షంగా హీరోయిన్ రష్మిక కంటే తానే ఎక్కువ తీసుకున్నట్టు ఒప్పుకున్నారు. దీన్ని బట్టి చూస్తే విజయ శాంతి ఈ చిత్రం కొరకు 1.5 కోట్ల కు పైగా అందుకొని ఉండవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇక అనిల్ రావిపూడి తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు రికార్డు కలెక్షన్స్ సాధిస్తుంది. దిల్ రాజు సమర్పణలో రామ బ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. దేవిశ్రీ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం :