ఆ నటుడికి విజయశాంతి సపోర్ట్ !

Published on Jun 28, 2021 11:00 am IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలలో విలక్షణ పాత్రలు పోషించే సీనియర్‌ నటుడు సీవీఎల్‌ నరసింహారావు కూడా పోటీ చేస్తోన్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా సీవీఎల్ నరసింహారావుకు నటి, బీజేపీ నాయకురాలు విజయశాంతి మద్దతు తెలపడం విశేషం. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేను ‘మా’ సభ్యురాలిని కాకున్నా ఒక కళాకారిణిగా ఈ అంశంపై స్పందిస్తున్నాను. మా ఎన్నికల పై సీవీఎల్ ఆవేదన న్యాయమైనది’ అంటూ విజయశాంతి తెలియజేసారు.

ఇప్పటికే మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, జీవిత, హేమ ఇలా నలుగురు బరిలో నిలిచారు. వారి మధ్య నెలకొన్న పోటీ తీవ్రతకే మా ఎన్నికల హడావుడి రోజుకో మలుపు తిరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో సీవీఎల్ లాగా తాను అధ్యక్ష పదవి బరిలో ఉన్నామంటూ రోజుకో ఆర్టిస్ట్‌ ముందుకొస్తుండటమే ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక సీవీఎల్ మాత్రం ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం నేను గతంలో అన్ని రకాల కృషి చేశానని, భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :