“బీస్ట్” డైరెక్టర్‌ పై విజయ్ తండ్రి ఆగ్రహం!

Published on Apr 20, 2022 10:44 pm IST

ఇటీవల విడుదలై అభిమానుల అంచనాలను అందుకోలేక పలువురిని నిరాశపరిచిన చిత్రం బీస్ట్. తమిళనాడులో ఈ సినిమా కొంత వసూళ్లు సాధిస్తున్నప్పటికీ మరో చోట మాత్రం పెద్ద ఫ్లాప్ అయింది. ఇప్పుడు విజయ్ తండ్రి చంద్రశేఖర్ ఈ చిత్రాన్ని ఇంత దారుణంగా తెరకెక్కించినందుకు దర్శకుడిపై విరుచుకు పడ్డారు.

ఒక ఇంటర్వ్యూలో, ప్రముఖ నిర్మాత మరియు దర్శకుడు బీస్ట్‌ లో సరైన కథాంశాన్ని రాయనందుకు నెల్సన్‌ ను నిందించారు. విజయ్ ఇచ్చిన గొప్ప అవకాశాన్ని నెల్సన్ ఉపయోగించు కోలేదని మరియు సినిమాను ఇంత చెత్తగా ప్రదర్శించాడని చంద్రశేఖర్ తెలిపారు. ఫైట్‌లు తప్ప, సినిమాలో ఏమీ లేదని, నెల్సన్‌ ని పూర్తిగా తప్పుపట్టాల్సిందేనని చంద్రశేఖర్‌ అన్నారు.

సంబంధిత సమాచారం :