సినిమా హాళ్లు పూర్తిగా తెరుచుకున్నాక విడుదలకావడానికి కొన్ని పెద్ద సినిమాలు సిద్దంగా ఉన్నాయి. వాటిలో తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన ‘మాస్టర్’ కూడ ఒకటి. ప్రతి ఏడాది విజయ్ నుండి కనీసం ఒక్క సినిమా అయినా వస్తుంటుంది. కానీ లా డౌన్ మూలంగా 2020లో అది కుదరలేదు. దాంతో ఆయన అభిమానులే కాదు తమిళ సినీ ప్రేక్షకులు అందరూ బాగా డిసప్పాయింట్ అయ్యారు. అందుకే ‘మాస్టర్’ చిత్రాన్ని థియేటర్లు తెరుచుకున్న వెంటనే విడుదలచేయాలని నిర్ణయించారు నిర్మాతలు.
ముందుగా 2021 సంక్రాంతికి కానుకగా విడుదలచేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఖచ్చితమైన తేదీ చెప్పలేదు. తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు జనవరి 13న విడుదల ఉంటుందని తెలుస్తోంది. ఈ వార్తతో విజయ్ అభిమానులు ఖుషీ అవుతున్నారు. అయితే ఈ విషయమై అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని తెలుగులో కూడ ‘మాస్టర్’ పేరుతోనే విడుదల చేయనున్నారు. ఈస్ట్ కోస్ట్ పోరాడక్షన్స్ బ్యానర్ ద్వారా మహేష్ కోనేరు రిలీజ్ చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో విజయ్ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటించడం జరిగింది.


