జూన్ నుండి మొదలుకానున్న దేవరకొండ కొత్త సినిమా !

యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన సైంటిఫిక్ థ్రిల్లర్ ‘టాక్సీవాలా’ మే 18న విడుదలకానున్న సంగతి తెలిసిందే. దీంతో ఆయన తన తర్వాతి సినిమాలకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన సైన్ చేసిన కొత్త సినిమాల్లో నూతన దర్శకుడు భరత్ కమ్మ సినిమా కూడ ఉంది.

లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉండనున్న ఈ చిత్రాన్ని జూన్ మధ్య నుండి ఆరంభించనున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయికగా నటించనుంది. సక్సెస్ ఫుల్ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనుండగా, రష్మిక క్రీడాకారిణిగా నటించనుంది. ఇకపోతే విజయ్ ‘నోటా’ అనే తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో కూడ నటిస్తున్నాడు.