సమ్మర్ ని టార్గెట్ చేసిన విక్రమ్ కోబ్రా

Published on Feb 2, 2020 11:39 pm IST

చియాన్ విక్రమ్ కోబ్రా సమ్మర్ కానుకగా రానుంది. వేసవి సెలవులపై కనేసిన విక్రమ్ మే 22 న కోబ్రా చిత్రాన్ని విడుదల చేయాలని ప్రణాళికలు వేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ కోలీవుడ్ విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది. దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఓ ఆసక్తికర అంశంతో కోబ్రా చిత్రాన్నితెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఇటీవల ఈ చిత్ర టైటిల్ మరియు లోగో విడుదల చేయగా ఆసక్తికరంగా ఉంది. లలిత్ కుమార్ నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం ఏ ఆర్ రెహమాన్ అందిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో విక్రమ్ దర్శకుడు మణి రత్నం తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ మూవీ పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవలే థాయిలాండ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెకండ్ షెడ్యూల్ కి సిద్ధం అవుతుంది. కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయి, మోహన్ బాబు వంటి భారీ క్యాస్టింగ్ పొన్నియిన్ సెల్వన్ మూవీలో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :