బుక్ మై షో లో కమల్ “విక్రమ్” సెన్సేషనల్ రికార్డు.!

Published on May 24, 2022 3:00 pm IST

విశ్వ నటుడు కమల్ హాసన్ హీరోగా నటించిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “విక్రమ్”. దర్శకుడు లోకేష్ కనగ్ రాజ్ తో తీసిన ఈ సినిమా ఫస్ట్ టీజర్ నుంచే రుణాల్ని హైప్ ని సొంతం చేసుకొని ఇప్పుడు రిలీజ్ కి సిద్ధంగా ఉంది. అయితే ఈ సినిమాలో కమల్ తో పాటుగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ అలాగే మరో విలక్షణ నటుడు సూర్యల సమ్మేళనం కావడంతో ఆడియెన్స్ లో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

అయితే పాన్ ఇండియా లెవెల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమాకి హైప్ ఏ లెవెల్లో ఉందో బుక్ మై షో లో ఇంట్రెస్ట్స్ తో ప్రూవ్ అయ్యింది. ఈ సినిమాకి ఏకంగా బుక్ మై షో లో 2 మిలియన్ కి పైగా ఇంట్రెస్ట్ లు నమోదు అయ్యాయి. దీనితో ఈ చిత్రం ఈ సెన్సేషనల్ రికార్డు నమోదు చేసింది. ఇది మన ఇండియన్ సినిమా దగ్గర రెండో అత్యధికం అట. దీనిబట్టి కమల్ అభిమానులు మరియు ఆడియెన్స్ ఈ సినిమా కోసం ఏ లెవెల్లో ఎదురు చూస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం :