“తంగలాన్” పై ‘సీరియస్’ అప్డేట్ ఇచ్చిన విక్రమ్.!

“తంగలాన్” పై ‘సీరియస్’ అప్డేట్ ఇచ్చిన విక్రమ్.!

Published on Dec 17, 2023 8:00 AM IST

Thangalaan 1

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో టాలెంటెడ్ దర్శకుడు పా రంజిత్ కాంబినేషన్ లో తెరకెక్కించిన భారీ అవైటెడ్ చిత్రం “తంగలాన్” కోసం అందరికీ తెలిసిందే. అప్పటి వరకు అంతగా అంచనాలు లేని ఈ సినిమాపై టీజర్ వచ్చాక ఒక్కసారిగా సెన్సేషనల్ హైప్ అయితే లేచింది.

మెయిన్ గా విక్రమ్ మరోసారి తనలోని నటుణ్ని చాలా ఏళ్ల తర్వాత ఓ రేంజ్ లో చూపించగా ఈ సినిమా కోసం తమిళ్ సహా తెలుగు ఆడియెన్స్ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాపై ఓ సీరియస్ అప్డేట్ ని హీరో విక్రమ్ అందించాడు.

మరి తాను ఈ చిత్రానికి తన డబ్బింగ్ ని స్టార్ట్ చేసినట్టుగా తెలిపాడు. అలాగే తనతో పాటుగా తన టీం పిక్స్ కూడా షేర్ చేసి ఈ సినిమాపై సాలిడ్ అప్డేట్ అందించాడు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందించగా వచ్చే ఏడాది జనవరి 26న గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు