ఫైనల్ స్టేజ్ లో విక్రమ్ కొత్త సినిమా !

Published on Apr 28, 2019 4:00 pm IST

సీనియర్ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న తాజ చిత్రం ‘కదరం కొండన్’ అనుకున్న సమయానికే విడుదలకానుంది. ఈచిత్రం యొక్క పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరిదశకు చేరుకున్నాయి. అందులో భాగంగా మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను పూర్తి చేస్తున్నాడు.

రాజేష్ ఎమ్ సెల్వ తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో అక్షరా హాసన్ ముఖ్య పాత్రలో నటిస్తుంది. ట్రైడెంట్ ఆర్ట్స్ మరియు కమల్ హాసన్ హోమ్ బ్యానర్ రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ సంస్థలు కలిసి ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూర్య ఎన్ జి కె తో పోటీపడనుంది. ఈ రెండు సినిమాలు మే 31న విడుదలకానున్నాయి.

సంబంధిత సమాచారం :