“మహాన్”గా విక్రమ్‌ లుక్ అదిరిందిగా..!

Published on Aug 21, 2021 12:00 am IST

విక్రమ్‌ హీరోగా, కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే భారీ బడ్జెట్‌తో యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి తాజాగా టైటిల్‌ మరియు ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. ఈ చిత్రానికి “మహాన్” అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇక విక్రమ్‌ లుక్ పరంగా చూసుకుంటే పొడవాటి జుట్టు, గుబురు గడ్డంంతో బుల్లెట్ బండిపై ఎర్ర కళ్లజోడు పెట్టుకుని నువ్వుతూ కనిపించాడు. స్టైలిష్‌గా కనిపిస్తున్న విక్రమ్‌ వెనకాల బైక్‌పై కొమ్ములు, 16 చేతులతో ఎవరో కూర్చుని ఉన్నట్టు కనిపిస్తుండడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో విక్రమ్‌ సరసన సిమ్రన్‌ నటిస్తుండగా, విక్రమ్‌ తనయుడు ధ్రువ్‌ కూడా ఓ పాత్రలో కనిపించబోతున్నాడు. ఎస్‌.ఎస్‌. లలిత్‌ కుమరా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోశ్‌ నారాయణ్‌ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే సగభాగం షూటింగ్‌ను పూర్తిచేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

సంబంధిత సమాచారం :