విక్రమ్ నటిస్తున్న సినిమా రీమేక్ కాదట !

విక్రమ్ నటిస్తున్న సినిమా రీమేక్ కాదట !

Published on Sep 27, 2018 3:18 AM IST

తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన ‘సామి’ సినిమా ఇటీవల విడుదలై మిక్సడ్ టాక్ ను తెచ్చుకుంది. ఇక ఈ సీనిమా తరువాత విక్రమ్ ప్రస్తుతం ‘తూంగవనం’ పేమ్ రాజేష్ ఏం సెల్వ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ చిత్రంహాలీవుడ్ సినిమా ‘డోంట్ బ్రీత్’ కు రీమేక్ గా తెరకెక్కుతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలను విక్రమ్ కొట్టి పారేశారు. ఈచిత్రం రీమేక్ కాదని ఆయన క్లారిటీ ఈ ఇచ్చారు.

అయితే తమిళ చిత్ర వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని హాలీవుడ్ సినిమా ను ఇన్సిపిరేషన్ గా తీసుకొని రూపొందిస్తున్నారు. ప్రముఖ హీరో లోకనాయకుడు కమల్ హాసన్ సొంత బ్యానర్ రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ,ట్రైడెంట్ ఆర్ట్స్ సంయుక్తంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నాయి. కమల్ చిన్న కూతురు అక్షర హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు