
చియాన్ విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందని 123తెలుగు. కామ్ గతంలో పాఠకులకు తెలియజేసింది. ఈ సినిమాలో విక్రమ్ సరసన కథానాయికగా నయనతారను ఎంపిక చేశారు. ఈ తమిళ స్టార్ హీరోతో నయనతార జోడి కట్టడం ఇదే మొదటిసారి. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో నటించడం కూడా. ఈ క్రేజీ కాంబినేషన్ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. ఆల్రెడీ, గౌతమ్ మీనన్ విక్రమ్ కు కథ చెప్పడం, విక్రమ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగాయి. జూన్ నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తారు.
ఈ సంవత్సరం తమిళంలో నయనతార జోరును అడ్డుకోవడం మిగతా హీరోయిన్ల తరం కాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో 7 తమిళ సినిమాలు ఉన్నాయి. అవి ఈ ఏడాది విడుదల కానున్నాయి. అందులో సూర్య ‘మాస్’, శింబు ‘ఇదు నమ్మ ఆలు’ వంటి స్టార్ హీరో సినిమాలు ఉన్నాయి. ఫిమేల్ ఓరియెంటెడ్ హారర్ సినిమా ‘మాయ’పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

