
తమిళ స్టార్ హీరో విక్రమ్ ‘ఐ’ తర్వాత చేస్తోన్న సినిమా ’10 ఎంద్రతుకుల్ల’. ప్రముఖ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్ నిర్మాణంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి. ఇక కేవలం దర్శకుడిగానే కాక, నిర్మాతగానూ పలు ఆసక్తికర కథాంశాలను ఎంచుకుంటూ వెళుతోన్న మురుగదాస్ ఈ సినిమాను ఓ రోడ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారట. విజయ్ మిల్టన్ ఈ సినిమాకు దర్శకుడు. ఓ సరికొత్త కథ, అంతకుమించి సరికొత్త యాక్షన్ ఎపిసోడ్స్‌తో ఈ సినిమా ప్రేక్షకుల థ్రిల్ చేసేలా ఉంటుందని సినిమా యూనిట్ సమాచారం.
ఇక శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా, త్వరలోనే రాజస్థాన్‌కు షిఫ్ట్ కానుంది. అక్కడ ఓ భారీ ట్రైన్ ఫైట్‌ను ప్లాన్ చేశారు. అందరినీ అబ్బురపరచేలా ఆ ఫైట్ ఉండనుందని తెలుస్తోంది. ఇక 10 లెక్కపెట్టే లోపు అన్న అర్థంతో రూపొందుతోన్న ఈ సినిమా, టైటిల్‌కు తగ్గట్టుగానే థ్రిల్లింగ్‌గా నడుస్తుందట. ఈనెల 13న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయనున్నామని సినిమా యూనిట్ తెలిపింది. ఇక అక్టోబర్ 21న సినిమాను విడుదల చేయనున్నామని నిర్మాత ఏ.ఆర్.మురుగదాస్ ఇంతకుముందే తెలిపారు.

