మరో 3 రోజుల్లో “విక్రాంత్ రోణ” ట్రైలర్..!

Published on Jun 21, 2022 2:00 am IST

శాండిల్‌వుడ్ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’. ప్రముఖ సంస్థ జీ
స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్, శాలిని మంజునాథ్ నిర్మించిన ఈ చిత్రానికి అనుప్ భండారి దర్శకత్వం వహిస్తున్నాడు. జూలై 28న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ప్రచారం చిత్రాలకి, వీడియోలకి, సాంగ్స్‌కి మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. అయితే జూన్ 23 సాయంత్రం 5:02 నిమిషాలకు ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉంటే ఈ ఫాంటసీ యాక్షన్ అడ్వెంచర్ మూవీలో నిరూప్ భండారి, నీతా అశోక్ మరియు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక పాత్రలు పోషించారు.

సంబంధిత సమాచారం :