ఊరిపేరును సినిమా పేరుగా పెట్టుకున్న హీరో !

అక్కినేని హీరో సుమంత్ నటించబోతున్న 25వ సినిమా ఈరోజు ప్రారంభం అయ్యింది. నాగ చైతన్య ఈ సినిమాకు క్లాప్ కొట్టడం జరిగింది. ఈ మూవీకి సుబ్రమణ్య పురం అనే ఒక ఊరి పేరు పెట్టడం జరిగింది. నూతన దర్శకుడు జాగర్లపూడి సంతోష్ ఈ మూవీ తో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ధీరజ్ బొగ్గరం, సుధాకర్ రెడ్డి బీరంలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

ఈ చిత్రంలో నటించే ఇతర నటీనటుల సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. తెలుగమ్మాయి ఇషా రెబ్బ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం సుమంత్ కొత్త దర్శకుడు అనిల్ శ్రీకంఠం దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా తెరకెక్కబోతోంది. గౌతమ్ తిన్ననురి దర్శకత్వంలో సుమంత్ నటించిన మళ్ళిరావా సినిమా ఇటీవల విడుదలై సక్సెస్ అయిన సంగతి తెలిసిందే.