బోయపాటి శ్రీను.. కేరాఫ్ మాస్ ఆడియన్స్ !

Published on Jan 18, 2019 2:09 pm IST

ఊర మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారిన మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘మెగా పవర్ స్టార్’ రామ్ చరణ్ చేసిన పక్కా మాస్ ఎంటర్ టైనర్ ‘వినయ విధేయ రామ’. సంక్రాంతి కానుకగా జనవరి 11వ తేదీన విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ షో నుండే మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకున్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద ఇంకా కలెక్షన్లను రాబడుతూ… బి,సి సెంటర్లలో బాగానే సందడి చేస్తోంది.

కాగా పండగ వాతావరణం చల్లబడినప్పటికీ…ఈ సినిమా మాత్రం కలెక్షన్లను ఇంకా రాబడుతూనే ఉంది. ట్రేడ్ వర్గాలు ఆశ్చర్యపడేలా ఫస్ట్ వీక్ లో ఏపి, తెలంగాణలో సుమారు 50 కోట్ల షేర్ ను వసూళ్లు చేసింది. ముఖ్యంగా సీడెడ్, నైజాంతో పాటు ఉత్తరాంధ్రలో కూడా బోయపాటి… మళ్లీ ఘానాపాటి అనిపించాడు. ఎలాగూ విడుదలకు ముందే నిర్మాతలు టేబుల్ ప్రాఫిట్స్ చూశారు.

బాలీవుడ్ హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించిన ఈ సినిమాలో ‘జీన్స్’ ఫెమ్ ప్రశాంత్, అలాగే మాజీ హీరోయిన్ స్నేహ, మరియు ఆర్యన్ రాజేష్ లాంటి నటీనటులు నటించన ఈ చిత్రం భారీ అంచనాలు మధ్య విడుదలై.. ఏ సెంటర్స్ లో ఆ అంచనాలను అందుకోలేకపోయింది. అయితే బి.సి ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంది.

సంబంధిత సమాచారం :

X
More