‘వినయ విధేయ రామ’ సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది !

Published on Jan 5, 2019 3:58 pm IST

బోయపాటి శ్రీను దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా రాబోతున్న చిత్రం ‘వినయ విధేయ రామ’. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్య క్రమాలను కూడా పూర్తి చేసుకుంది.ఈ చిత్రం సంక్రాంతికి కానుకగా జనవరి 11న ‘U/A’ సర్టిఫై తో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

కాగా సెన్సార్ రిపోర్ట్ ప్రకారం ఈ చిత్రం మొదటి భాగం ఫ్యామిలీ సన్నివేశాలతో సరదాగా ఉంటుందని, అలాగే రెండో భాగంలో యాక్షన్ సీక్వెన్స్ తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా బాగా ఆకట్టుకుంటాయని.. ఖచ్చితంగా ఈ చిత్రం ప్రేక్షకులను అలరిస్తోందని సెన్సార్ టాక్. మరి చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ హిట్ అవుతుందో.

ఈ చిత్రంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ హీరో, హీరోయిన్లు ప్రశాంత్ మరియు స్నేహ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More