హీరోగా ఫస్ట్ లుక్ తో వచ్చిన వి.వి.వినాయక్ !

Published on Oct 8, 2019 5:00 pm IST

స్టార్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ప్రధాన పాత్రలో దిల్ రాజు నిర్మాణంలో ఓ చిత్రం రాబోతుందన్న విషయం తెలిసిందే. కాగా తాజాగా దసరా పండుగ సందర్భంగా అలాగే రేపు వినాయక్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసింది చిత్రబృందం. పోస్టర్ లో వినాయక్ చాల యంగ్ గా మంచి మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. భుజం మీద రెడ్ కలర్ టవల్ తో చేతిలో రేంచితో యాక్షన్ హీరోలా ఉన్నాడు వినాయక్. మొత్తానికి ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ చిత్రంలో వినాయక్ మెకానిక్ గా నటించనున్నారని తెలుస్తోంది.

ఇక ఇప్పటికే వినాయక్ ఈ సినిమా కోసం ఫిట్ గా కనిపించడానికి జిమ్‌ లో కఠినంగా వర్కౌట్స్ చేశారు. దాంతో వినాయక్ పోస్టర్ లో కనబడినట్లే సినిమాలో కూడా చాల ఫిట్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాకి దర్శకుడుగా నరసింహారావు వ్యవహరించనున్నారు. ఈయన గతంలో శరభ అనే సినిమాని తీశారు. మరి ఈ మూవీతో వినాయక్ ఆర్టిస్ట్ గానూ భారీ సక్సెస్ అందుకోవాలని కోరుకుందాం.

సంబంధిత సమాచారం :

X
More