మెగాస్టార్ కోసం వినాయక్ ప్రయత్నం !

Published on Jun 20, 2021 12:02 am IST

మెగాస్టార్ చిరంజీవి కోసం స్టార్ డైరెక్టర్ వినాయక్ ఫుల్ ఎంటర్ టైన్మెంట్ తో సాగే స్క్రిప్ట్ ను రెడీ చేస్తోన్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా మెగాస్టార్ కి వినాయక్ కథ చెప్పాడని తెలుస్తోంది. కానీ వినాయక్ కథ విన్న మెగాస్టార్ ఇంకా ఏ విషయం చెప్పలేదని తెలుస్తోంది. ప్రస్తుతం చిరు చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఆచార్య సినిమాతో పాటు ‘లూసిఫర్’ రీమేక్ ను కూడా పూర్తి చేయాలనే ప్లాన్ లో ఉన్నారు మెగాస్టార్.

కాగా ‘లూసిఫర్’ స్క్రిప్ట్ లో మెగాస్టార్ కోసం కొన్ని మార్పులు చేశారు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ విషయంలో కూడా భారీగానే ప్లాన్ చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మెగాస్టార్ అనుచరుడి పాత్ర కథా పరంగా చాల కీలకమైనది. ఎక్కువగా సినిమాలో హీరో తన అసిస్టెంట్ చేతే చేయిస్తూ ఉంటాడు కాబట్టి.. ఇప్పుడు ఈ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నాడు. అలాగే ఈ సినిమాలో హీరోకి చెల్లి పాత్రలో సుహాసిని నటించనుంది.

సంబంధిత సమాచారం :