“అన్నాత్తే” తో మళ్ళీ వింటేజ్ తలైవర్.!

Published on Apr 12, 2021 1:00 pm IST

కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ అక్కడి స్టార్ దర్శకుడు శివ దర్శకత్వంలో “అన్నాత్తే” అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు కూడా ఉన్నాయి. అయితే కరోనా లేకున్నా ఉన్నట్టయితే ఈ పాటికే విడుదల కూడా అయ్యిపోవాల్సిన ఈ చిత్రం అలా వాయిదా పడుతూ వచ్చింది. మరి ఎట్టకేలకు ఈ భారీ చిత్రాన్ని మేకర్స్ స్టార్ట్ చేసారు.

మరి ఈ చిత్రం నుంచి మేకర్స్ ఓ ఆన్ లొకేషన్ స్టిల్ ను బయటకు వదిలారు. ఇది చూస్తే మళ్ళీ వింటేజ్ రజినీ ఫీస్ట్ ఖాయం అని అనిపిస్తుంది. ఆ పంచె కట్టు మరియు లైట్ ట్రిమ్మింగ్ లుక్ చూస్తే మళ్ళీ పాత రోజులు గుర్తుకు రాక మానవు. ఇది వరకే ఇలాంటి గెటప్ లో రజినీ “పేట” సినిమాలో కనిపించారు. మరి ఇందులో ఎలా ఉంటారో చూడాలి. ఇక ఈ చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా ఇమన్ సంగీతం అందిస్తున్నారు. అలాగే సన్ పిక్చర్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం :