వైరల్ : తన సతీమణితో బన్నీ అరుదైన సెల్ఫీ!

Published on Feb 21, 2022 4:00 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహా రెడ్డితో కలిసి ఈ రోజు హైదరాబాద్‌లో సరదాగా చిన్నపాటి విహారయాత్ర చేశాడు. ఈ క్రమంలో ఒక సెల్ఫీని తీసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. కాగా ఈ సెల్ఫీలో ఈ జంట చాలా అందంగా కనిపిస్తుంది. దాంతో ఈ సెల్ఫీ బాగా వైరల్ అవుతుంది.

ముఖ్యంగా సెల్ఫీలో బన్నీ పేస్ లోని ఫ్రెష్ నెస్, పక్కన స్నేహా రెడ్డి ప్రేమగా భర్తను ప్రేమగా హత్తుకోవడం బాగా ఆకట్టుకున్నాయి. ఇక బన్నీ ప్రస్తుతం షూట్ కి విరామం తీసుకున్నాడు. త్వరలోనే పుష్ప రెండవ భాగం షూటింగ్‌ ను తిరిగి ప్రారంభించనున్నాడు.

అన్నట్టు ఈ జంట తమ కుమారుడు అల్లు అయాన్ మరియు, కూతురు అర్హకు సంబంధించిన కొన్ని అందమైన వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ బన్నీ ఫ్యాన్స్ తో తరచుగా పంచుకుంటారు. అందుకే స్నేహా రెడ్డికి ఇన్‌స్టాగ్రామ్‌లో భారీగా ఫాలోవర్స్ పెరిగారు.

సంబంధిత సమాచారం :