వియ్యంకుడు సాయి తేజ్ కు ధన్యవాదాలు – మంచు మనోజ్

Published on Jun 29, 2020 11:05 am IST

హీరో మంచు మనోజ్ గొప్ప జంతు ప్రేమికుడు అని అందరికీ తెలిసిందే. మనోజ్ ఎప్పుడూ తన పెంపుడు కుక్క ఫోటోలను అలాగే దానితో సరదాగా గడిపిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమనులతో పంచుకుంటాడు.

కాగా మరోసారి, మనోజ్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి తమ పెంపుడు కుక్కులకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ పెట్టాడు, ‘సాంఘిక దూరంతో టాంగో మరియు జోయాకు ఇది వాటికీ ప్రత్యేకమైన రోజు. నాకు మంచి అల్లుడు ఇచ్చినందుకు నా వియ్యంకుడు సాయి ధరమ్ తేజ్ కు ధన్యవాదాలు. త్వరలోనే ముహూర్తలు పెట్టించి శుభలేఖలు వెయిస్తాం” అని సరదాగా పోస్ట్ చేస్తూ.. తమ కుక్కలతో దిగిన ఫోటోను షేర్ చేశాడు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా వైరల్ అవుతుంది. పెంపుడు కుక్కలు రెండూ వారి హీరోలతో పాటు చాలా బాగున్నాయి. ఇక మంచు మనోజ్‌ సినిమాలకు చాల గ్యాప్ ఇచ్చి ఎట్టకేలకు మళ్లీ ‘అహం బ్రహ్మాస్మి’తో మళ్ళీ సినిమాల్లో యాక్టివ్ కాయబోతున్నాడు.

సంబంధిత సమాచారం :

More