వైరల్: “కోర్ట్” సక్సెస్ మీట్ లో చార్ట్ బస్టర్ కి చిందేసిన నాని!

వైరల్: “కోర్ట్” సక్సెస్ మీట్ లో చార్ట్ బస్టర్ కి చిందేసిన నాని!

Published on Mar 15, 2025 11:00 PM IST

నాచురల్ స్టార్ నాని హీరోగా ఇపుడు రెండు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రాలు మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తాను పలు సినిమాలు చేస్తున్నాడు. ఇలా నాని బ్యానర్ నుంచి వచ్చిన చిత్రమే “కోర్ట్”. ప్రియదర్శి, శివాజీ అలాగే హర్ష రోహన్ తదితరుల కలయికలో దర్శకుడు రామ్ జగదీశ్ తెరకెక్కించిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.

అయితే ఈ సినిమా సక్సెస్ కావడంతో నాని వెంటనే సక్సెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో యువ నటీనటులు ఈ సినిమా చార్ట్ బస్టర్ ప్రేమలో సాంగ్ కి స్టెప్పేస్తూ నానిని కూడా స్టేజి మీదకి తీసుకెళ్లిపోయారు. మరి అక్కడ నుంచి నాని సహా ఆ ఇద్దరు పిల్లలు, ప్రియదర్శి కలిసి స్టెప్పేస్తుంటే అది చూసేందుకు అభిమానులు రెండు కళ్ళు సరిపోలేదని చెప్పవచ్చు. నాని తన మార్క్ ఈజ్ తో ఆ స్టెప్పులేస్తుంటే ఈ ఈవెంట్ కే స్పెషల్ అట్రాక్షన్ గా ఇది మారిపోయింది. దీనితో ఈ క్లిప్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు