చిరు సినిమాలో ఐశ్వర్యరాయ్.. హాట్ డిస్కషన్

Published on Jul 12, 2019 2:02 am IST

చిరంజీవి, ఐశ్వర్యారాయ్.. ఈ కాంబినేషన్ పట్ల ఎవరికైనా ఆసక్తి కలగడం కామన్. ప్రస్తుతం ఈ వార్తే ఫిల్మ్ నగర్లో హాట్ డిస్కషన్ అయింది. చిరు తన 152వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయకిగా మొదట నయనతార చేస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ఐశ్వర్యారాయ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

నయనతార ప్రస్తుతం చిరు చేస్తున్న ‘సైరా’ చిత్రంలో నటిస్తోంది. వీరి కాంబినేషన్ ఇదే మొదటిసారి. అయినా కూడా వెంటవెంటనే రెండో సినిమాలో వీరి జోడీని రిపీట్ చేస్తే బాగుండదని, పైగా ఐష్, చిరులు ఇప్పటి వరకు కలిసి నటించలేదు కాబట్టి పెయిర్ కొత్తగా, క్రేజీగా ఉంటుందని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్టు సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి ఈ వార్తలు నిజమో కాదో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

గతంలో చిరు రీ ఎంట్రీ చిత్రం ‘ఖైదీ నెం 150’లో మొదట ఐశ్వర్యారాయ్ కథానాయిక అని వార్తలోచ్చాయి కానీ చివరికి కాజల్ అగార్వల్ ఫైనల్ అయింది. దీంతో ఈసారైనా వీరి కాంబినేషన్ సెట్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.

సంబంధిత సమాచారం :

X
More