వైరల్ పిక్: ‘ఓజి 2’ డిస్కషన్ లో పవన్, సుజీత్.. ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్

వైరల్ పిక్: ‘ఓజి 2’ డిస్కషన్ లో పవన్, సుజీత్.. ఇది పర్ఫెక్ట్ ప్లానింగ్

Published on Jun 21, 2026 7:00 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ చిత్రం ఓజి కోసం అందరికీ తెలిసిందే. పవన్ ఫ్యాన్స్ లో ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఈ సినిమాకి ఉంది. దీనితో హైప్ కూడా ఆకాశాన్ని అంటే రేంజ్ లో కొనసాగుతూ ఉండగా ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ కోసం ఏ చిన్న హింట్ వచ్చినా అది సోషల్ మీడియాలో నెక్స్ట్ లెవెల్ బ్లాస్ట్ అవుతుంది.

రీసెంట్ గానే పవన్ సైడ్ నుంచి సుజీత్ వెకేషన్ నుంచి వచ్చాక ఓజి 2 ముందుకు వెళుతుంది అని కన్ఫర్మ్ చేసారు. తీరా వచ్చిన తర్వాత దీనికి సెపరేట్ గా డిస్కషన్ కూడా పెట్టేసినట్టు ఊహించని అప్డేట్ అందించారు. దీనితో పవన్ నుంచి ఓ సినిమాకి ఈ రేంజ్ లో ముందు నుంచే ప్లానింగ్ లు జరుగుతుండటంతో ఫ్యాన్స్ కూడా ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా సుజీత్, పవన్ లు కలిసి డిస్కస్ చేస్తున్న పిక్ వైరల్ గా మారిపోయింది. మరి ఇదంతా చూస్తూ ఉంటే సినిమా త్వరలోనే మొదలైనా మొదలయ్యేటట్టే కనిపిస్తుంది. సో ఈ మాసివ్ ప్రాజెక్ట్ విషయంలో మున్ముందు ఎలాంటి ట్విస్ట్ లు చోటు చేసుకుంటాయో చూడాలి.

తాజా వార్తలు