మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్ లో తెరకెక్కించిన ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామా చిత్రం “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. ఈ ఏడాదికి టాలీవుడ్ నుంచి మరో సాలిడ్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకి మంచి బజ్ రేకెత్తించడంలో సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ అందించిన చార్ట్ బస్టర్ చికిరి చికిరి తో బ్లాక్ బస్టర్ ఆరంభం అందించారు.
ఇక ఇందులో రామ్ చరణ్ కంపోజ్ చేసిన బ్యాట్ తో సిగ్నేచర్ మూమెంట్ కూడా బాగా వైరల్ అయ్యింది. అయితే ఈ స్టెప్ ని తాజాగా చరణ్ పర్శనల్ బాడీ గార్డ్ కెవిన్ కుంట రీక్రియేట్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. దీనితో ఫ్యాన్స్ ఇది చూసి మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఆల్రెడీ కెవిన్ క్రేజ్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఉంది. ఇప్పుడు పెద్ది స్టెప్ తో తాను మరింత వైరల్ గా మారాడు. ఇక ఈ చిత్రంకి వృద్ధి సినిమాస్ నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.


