డీల్ క్యాన్సిల్ చేసుకున్న రానా “విరాటపర్వం”.?

డీల్ క్యాన్సిల్ చేసుకున్న రానా “విరాటపర్వం”.?

Published on Jul 30, 2021 8:00 AM IST


ప్రస్తుతం మన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి నటించిన తాజా చిత్రం “విరాట పర్వం” కూడా రిలీజ్ కి రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. నాచురల్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించిన ఈ చిత్రం ఆసక్తికర క్యాస్టింగ్ తో తెరకెక్కింది. అయితే పలు చిత్రాలు సహా వారి ఫ్యామిలీ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన సినిమాలు కూడా ఓటిటి దారిలోనే ఉన్నాయి అన్నప్పుడు నుంచి రానా విరాట పర్వం పై కూడా బజ్ వచ్చింది.

ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్ వారు డైరెక్ట్ ఓటిటి రిలీజ్ చేయనున్నారని. కానీ ఇప్పుడు తాజా టాక్ ఏమిటంటే మేకర్స్ ఆ డీల్ ను క్యాన్సిల్ చేసుకున్నారని టాక్ వినిపిస్తుంది. వారు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నారట. అందుకే ఓటిటి రిలీజ్ వద్దనుకున్నారని తెలుస్తుంది. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీతం అందివ్వగా సురేష్ ప్రొడక్షన్స్ మరియు శ్రీ లక్ష్మి వెంకటేశ్వరా సినిమాస్ వారు నిర్మాణం వహించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు