ఎట్టకేలకు విడుదల కాబోతుంది.. కొత్త పుకారు !

Published on May 29, 2022 9:16 pm IST

‘రానా – సాయి పల్లవి’ కలిసి చేస్తున్న చిత్రం ‘విరాటపర్వం’. దర్శకుడు ‘వేణు ఉడుగుల’ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా కారణంగా, ఆ తర్వాత కొన్ని సమస్యల కారణంగా ఈ సినిమా పోస్ట్ ఫోన్ అవుతూ వచ్చింది. కాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ పై కొత్త అప్ డేట్ వినిపిస్తోంది. ఈ చిత్రాన్ని జూలై 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.

మొత్తానికి ఎట్టకేలకు విరాట పర్వం విడుదల కాబోతుంది. కాకపోతే, ఈ వార్తలు ఎంతవరకు నిజం అవుతాయి అనేది చూడాలి. ‘విరాటపర్వం’ ఉమెన్‌హుడ్‌ కి ఒక నివాళి అని ‘వేణు ఉడుగుల’ ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. కాగా 1990 నాటి సామాజిక పరిస్థితుల ఆధారంగా రానున్న ఈ పీరియాడిక్ సోషల్ డ్రామాలో రానా నక్షలైట్ నటిస్తున్నాడు. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సురేష్ బొబ్బిలి సంగీత దర్శకుడు.

సంబంధిత సమాచారం :