‘విరాట పర్వం’ ఓటిటీ రిలీజ్ డేట్ ఫిక్స్

Published on Jun 29, 2022 6:53 pm IST

దగ్గుబాటి రానా, యువ నటి సాయి పల్లవి ల తొలి కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా సినిమా విరాట పర్వం. వేణు ఉడుగుల తీసిన పీరియాడిక్ రొమాంటిక్ యాక్షన్ డ్రామాలో కామ్రేడ్ రవన్నగా రానా నటించగా, వెన్నెల పాత్రలో నటించారు సాయి పల్లవి. మొదటి నుండి అందరిలో మంచి అంచనాలు ఏర్పరిచిన విరాట పర్వం మూవీ రిలీజ్ తరువాత అన్ని అంచనాలు అందుకుని మంచి సక్సెస్ సాధించింది.

సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందించిన ఈ మూవీని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ సంస్థలపై సుధాకర్ చెరుకూరి, రానా దగ్గుబాటి, శ్రీకాంత్ చుండి కలిసి నిర్మించారు. నక్సలిజం నేపథ్యంలో ఆకట్టుకునే యాక్షన్ ఎమోషనల్ అంశాలతో ఈ మూవీని దర్శకుడు వేణు ఎంతో అద్భుతంగా తెరకెక్కించి అందరి నుండి మంచి ప్రశంసలు అందుకున్నారు. కాగా ఈ మూవీ జులై 1న ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ద్వారా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ప్రేక్షకులకి అందుబాటులో రానుంది. కొద్దిసేపటి క్రితం ఈ విషయాన్ని నెట్ ఫ్లిక్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది.

సంబంధిత సమాచారం :